ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2018 మార్కులు విడుదలయ్యాయి. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కుల జాబితాను ఉంచారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) క్లర్క్ మెయిన్స్ 2018 మార్కులను విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8,301 పోస్టులకు సంబంధించి జనవరి, 2018న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు మొదలవగా.. ఫిబ్రవరి 10, 2018లో ముగిసింది. క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్టు 5, 2018న ఆదివారం నిర్వహించారు. మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలను సెప్టెంబర్ 21, 2018నే విడుదల చేయగా.. అక్టోబర్ 8, 2018 సోమవారం నాడు మార్కులను విడుదల చేశారు. మార్కులను sbi.co.in/careers అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.


ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2018 ఫలితాలు: ఎలా చెక్ చేసుకోవాలి?


  • అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/careers లోకి వెళ్లండి.

  • రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.

  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్, రోల్ నెంబర్‌ను నమోదు చేయండి.

  • మార్కులు స్క్రీన్ మీద కనిపిస్తాయి.

  • డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లాంటి చిత్రాలను రూపొందించి కొన్ని నకిలీ వెబ్‌సైట్‌లు ఇంటర్‌నెట్‌లో దర్శనమిస్తున్నాయని, వాటి పట్ల అభ్యర్థులు అలర్ట్‌గా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. ఈ వెబ్‌సైట్‌లలో ఎస్బీఐ పోస్టుల కోసం ఎంపిక చేసిన నకిలీ జాబితాలను, నకిలీ నియామక ఉత్తర్వులను ఉంచారని పేర్కొంది. కాబట్టి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ sbi.co.in/careers, bank.sbi.Careers లను మాత్రమే విశ్వసించాలని ఎస్‌బీఐ పేర్కొంది.