స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు చేదు వార్త. క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వాడుతున్న బ్యాంక్‌ ఖాతాదారులు ఎస్‌బీఐ.. నగదు డ్రాకు పరిమితులు విధించింది. ఇప్పటివరకు రోజుకు రూ.40వేల వరకు నగదును ఏటీఎంల నుంచి డ్రా చేసుకొనేందుకు వీలుండగా, అక్టోబరు 31 అర్థరాత్రి నుంచి రూ.20 వేలకు పరిమితిని విధించింది ఎస్‌బీఐ (ఎకనామిక్స్ టైమ్స్ కథనం మేరకు..).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏటీఎంల వద్ద నగదు డ్రాలో మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తుండటంతో.. వాటికి అరికట్టేందుకు అలాగే డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.


గత కొద్దిసంవత్సరాలుగా ఏటీఎంల వద్ద నగదు డ్రా చేసేటప్పుడు మోసాలు పెరిగాయి. కొందరు వ్యక్తులు ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాల సహాయంతో వినియోగదారుల డెబిట్ కార్డు పిన్ నెంబర్‌ను దొంగలిస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఎస్‌బీఐ ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నగదు పరిమితి నిబంధనను దీపావళి ముందే అమల్లోకి తీసుకొని రావాలని  ఎస్‌బీఐ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు కూడా ఈ నివేదికలు తెలిపాయి.


ఎస్‌బీఐ కార్డులు అధికంగా వాడేది ఉద్యోగులు, సామాన్యులే. వీరిలో ఎక్కువ మంది రోజుకు రూ.20 వేలు మించి తీయరు. వ్యాపారస్తులు మాత్రమే రూ.40,000 వరకు ఏటీఎంల నుంచి మనీ డ్రా చేసుకుంటున్నారు. వ్యాపారస్తులు కరెంటు వాడకుండా.. ఇలాంటివి చేస్తుండటంతో.. బ్యాంక్‌ ఈ కఠిన చర్యలకు దిగినట్లు కొందరు భావిస్తున్నారు.