SBI updates : భారీగా సర్వీస్ ఛార్జిలను పెంచి ఆ కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్బీఐ
ఆధాయం అధికంగా వచ్చే ఏ మార్గాన్ని బ్యాంకులు వదులుకోవడానికి ఇష్టపడవనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఎస్బీఐ లాకర్ల సర్వీస్ ఛార్జీలు పెంచింది. లాకర్ల సైజ్ ఆధారంగా కనీసం రూ.500 నుంచి రూ.3,000 వరకు ఛార్జీలు ఎస్బీఐ లాకర్ల ఛార్జీలు పెరిగాయి.
న్యూ ఢిల్లీ: ఆధాయం అధికంగా వచ్చే ఏ మార్గాన్ని బ్యాంకులు వదులుకోవడానికి ఇష్టపడవనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఎస్బీఐ లాకర్ల సర్వీస్ ఛార్జీలు పెంచింది. బంగారం, ఆభరణాలు, డాక్యుమెంట్స్ వంటి విలువైన వస్తువులను సురక్షితంగా దాచుకోవడం కోసం ఎవరైనా బ్యాంక్ లాకర్లను ఆశ్రయించాల్సిందేననే సంగతి తెలిసిందే. అందుకే బ్యాంకులు సైతం బ్రాంచీలు ఉన్న ప్రాంతాలు, లాకర్ల సైజు ఆధారంగా వివిధ స్థాయిల్లో లాకర్ల సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల అవసరాలను క్యాష్ చేసుకుంటూ తాజాగా ఎస్బీఐ లాకర్ల చార్జీలు పెంచింది. లాకర్ల సైజ్ ఆధారంగా కనీసం రూ.500 నుంచి రూ.3,000 వరకు ఛార్జీలు ఎస్బీఐ లాకర్ల ఛార్జీలు పెరిగాయి. లాకర్ల సైజ్, బ్రాంచి ఉన్న నగరం ప్రాధాన్యతలకు అనుగుణంగా 33 శాతం వరకు బ్యాంకు లాకర్ల ఛార్జీలు పెరిగాయి. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచీలలోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ కలిగిన లాకర్ల ఛార్జీలు పెంచుతున్నట్టు ఇటీవలే ఎస్బీఐ ప్రకటించింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో చిన్న సైజ్ లాకర్ కోసం ఎస్బీఐ కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కనీసం రూ.1,500 వరకు ఛార్జ్ చేస్తోంది. తాజాగా ఎస్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఇదే మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలు రూ.500 పెరిగాయి.
Related article : SBI Bank Holidays in March: మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!
ఇక మీడియం సైజ్ లాకర్స్ ఛార్జీల పెంపు విషయానికొస్తే.. ప్రస్తుతం మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.3,000 వరకు ఉన్న మీడియం సైజ్ లాకర్ల చార్జీలను రూ.4,000 వరకు పెంచుతున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 గా ఉన్న మీడియం సైజ్ లాకర్స్ చార్జీలను రూ.3,000 కు పెరిగాయి.
మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో లార్జ్ సైజ్ లాకర్స్ చార్జీలను రూ.2,000 పెరిగాయి. దీంతో ఇప్పటివరకు రూ.6,000 గా ఉన్న లార్జ్ సైజ్ లాకర్ల చార్జీలు ఏకంగా రూ.8,000 కానున్నాయి. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.5,000 నుండి రూ.6,000 కానున్నాయి.
Related article : SBI customers KYC alert : ఖాతాదారులకు ఎస్బిఐ షాక్
ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లాకర్స్ విషయంలో ఛార్జీలు మరింత పెరిగాయి. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లాకర్స్ చార్జీలు రూ.3వేలు పెరిగాయి. దీంతో ఇప్పటివరకు రూ.9,000గా ఉన్న ఆ సేవల రుసుం మార్చి 31 తర్వాత రూ.12,000 కానుంది. ఇక సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 పెంచుతున్నట్టు ఎస్బీఐ పేర్కొంది. దీంతో ఈ బ్రాంచీలలో ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్స్ చార్జీలు రూ.7,000 నుండి రూ.9,000లకు పెరిగింది. అంతేకాదండోయ్.. లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లాకర్లకు జీఎస్టీ బాదుడు అదనం కానుంది. మార్చి 31 తర్వాత పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయని.. కొత్తగా పెరిగిన చార్జీలను చెల్లించని వారిపై 40 శాతం జరిమానా వేయకతప్పదని ఎస్బీఐ హెచ్చరించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..