SBI Jobs: భారతీయ స్టేట్ బ్యాంక్ వివిధ కేటగరీల్లో ప్రత్యేక కేడర్ ఆఫీసర్లను నియమిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసేందుకు త్వరపడండి. మరోఐదురోజులు మాత్రమే గడువు మిగిలుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్ధుల్నించి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఎస్బీఐ. అర్హులైన వారు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 28. 


ఎకనామిస్ట్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 ఉండగా ఫ్రాడ్ రిస్క్ విభాగంలో అడ్వైజర్ పోస్టులు 4 ఉన్నాయి. ఇక పెర్ఫార్మెన్స్ అండ్ ప్లానింగ్ విభాగంలో మేనేజర్ పోస్టులు 2 ఖాళీలున్నాయి. ఎకనామిక్స్ విభాగానికి స్టాటిస్టిక్స్, మేథ్స్, మేథమెటికల్ ఎకనామిక్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అంశాల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఫైనాన్స్‌లో ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్ధులు అర్హులు. మూడేళ్ల అనుభవం కూడా తప్పనిసరి. ఇక అడ్వైజర్ విభాగంలో పోస్టులకు గ్యాడ్యుయేట్ అయి ఉండి..ఐపీఎస్ లేదా స్టేట్ పోలీస్, సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సీఈఐబీ ఆఫీసర్‌‌గా కనీసం ఐదేళ్లు పనిచేసుండాలి. ఇక మేనేజర్ విభాగంలో పోస్టులకు బీకామ్, బీఈ, బీటెక్, ఎంబీఏలలో ఏదో ఒకటి కలిగి ఉండి..నాలుగేళ్ల అనుభవముండాలి. 


జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులకు 750 రూపాయలు ఫీజు కాగా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఏ విధమైన ఫీజు లేదు. ఎస్బీఐ అధికారి వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఏప్రిల్ 8 నుంచి స్వీకరిస్తున్నారు. చివరి చేదీ ఏప్రిల్ 28, 2022 గా ఉంది. ఏప్రిల్ 28 తరువాత పెనాల్టీతో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తారు. 


Also read: Jammu Terror Attack: సుంజ్వాన్ లోని CISF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.