న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు భారతీయ బ్యాంక్ (ఎస్బీఐ) మానవతా దృక్పథంతో గొప్ప నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ కింద సైనికుల కుటుంబాలకు ఇవ్వాల్సి వున్న రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కవర్‌ను తక్షణమే విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఎస్బీఐ.. అమరులైన సైనికుల్లో 23 మంది తీసుకున్న రుణాలను తక్షణమే మాఫీ చేస్తున్నట్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో  bharatkeveer.gov.in ద్వారా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి మానవతా దృక్పథంతో విరాళాలు అందించాల్సిందిగా తమ సంస్థ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణ పౌరులు సైతం ఎస్బీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా అమరవీరుల కుటుంబాలకు తమవంతు ఆర్థిక సహాయం అందించవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో Payment/Transfer- Donations, Bharat Ke Veer ద్వారా విరాళాలు బదిలీ చేయవచ్చని ఎస్బీఐ పేర్కొంది.