పుల్వామా దాడి: అమరవీరుల బ్యాంకు రుణాలపై ఎస్బీఐ కీలక నిర్ణయం
పుల్వామా దాడి: అమరవీరుల బ్యాంకు రుణాలపై ఎస్బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు భారతీయ బ్యాంక్ (ఎస్బీఐ) మానవతా దృక్పథంతో గొప్ప నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ కింద సైనికుల కుటుంబాలకు ఇవ్వాల్సి వున్న రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కవర్‌ను తక్షణమే విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఎస్బీఐ.. అమరులైన సైనికుల్లో 23 మంది తీసుకున్న రుణాలను తక్షణమే మాఫీ చేస్తున్నట్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో bharatkeveer.gov.in ద్వారా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి మానవతా దృక్పథంతో విరాళాలు అందించాల్సిందిగా తమ సంస్థ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది.