సుప్రీం కోర్టు తీర్పు ముస్లింలకు అనుకూలంగా వస్తే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మిస్తామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పైవిధంగా స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మా మసీదు అక్కడే ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఉంటే అదే స్థలంలో మరోసారి మసీదును నిర్మిస్తాం' అని ఒవైసీ అన్నారు. తీర్పు వాస్తవాల ఆధారంగానే ఉంటుంది. మత విశ్వాసాల ఆధారంగా కాదనే నమ్మకం ఉందన్నారాయన. ముస్లింలు అక్కడ మసీదును నిర్మించాలన్న డిమాండ్ ను ఎన్నడూ విడిచిపెట్టరని అన్నారు. "మసీదుకు, షరియత్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారికి చెబుతున్నా.. మేము ఆ స్థలాన్ని ఎప్పటికీ విడిచిపెట్టము" అని ఒవైసీ చెప్పారు.


పీఎన్బీ కుంభకోణానికి ముడిపెడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎఐఎంఐఎం చీఫ్ విమర్శలు సంధించారు. 'మమ్మల్ని పాకిస్తానీ అని పిలిచే వారిని ప్రశ్నించేది ఒక్కటే.. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, నిరవ్ మోదీ ముస్లింలా? వారు మన ప్రధానిని 'భాయ్' అని పిలిచి దేశాన్ని దోచుకున్నారు' అని ఒవైసీ చెప్పారు. భారత్ లో ముస్లింలు రెండో తరగతి ప్రజలుగా మారోపోయరని ఆవేదన వ్యక్తం చేశారు.