'చౌకీదార్‌ చోర్‌ హై' అనే పద ప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి నోటీసులు జారీ చేసింది. రాహుల్ తన వ్యాఖ్యల విషయంలో ఎంత మాత్రం పశ్చాతాపం చూపలేదని ధర్మసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో మరింత వివరంగా లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 క్షమాపణలు కోరనందుకే..
 'చౌకీదార్‌ చోర్‌ హై' వ్యాఖ్యలపై రాహుల్ ఇచ్చిన వివరణపై ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ  వాదిస్తూ  రాహుల్ గాంధీ ఇచ్చి వివరణలో ఎక్కడా పశ్చాతాపం కనిపించలేదన్నారు. రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎక్కడా ఆయన క్షమాపణలు కోరలేదని... కేవలం చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించానని మాత్రమే ఒప్పుకున్నారని ధర్మాసనానికి వివరించారు. రాహుల్‌ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్‌లో పెట్టారని వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది


వివాదం మొదలైంది ఇలా...
రాఫెల్ ఒప్పందంపై  కాంగ్రెస్ పార్టీ రెండో సారి వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీకోర్టు స్వీకరించింది. ఈ విషయంలో ఎలాంటి తీర్పు వెలువరించలేదు. అయితే అమేథి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ  చౌకీ దార్ ( ప్రధాని మోడీ ఉద్దేశించి) చోర్ హై సుప్రీంకోర్టు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదంగా మారింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వక్రీకరించారని బీజేపీ మండిపడింది.


ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మినాక్షిలేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు..దీని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడంతో రాహుల్ స్పందిస్తూ తన వ్యాఖ్యలపై విచారిస్తున్నానని తన అఫిడవిట్ లో పేర్కొని..ఇది ఎన్నికల ప్రచార జోరులో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తమను రాజకీయంగా దెబ్బతీసేందేందుకు ప్రత్యర్ధి పార్టీల వారు కుట్ర చేస్తున్నారని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. దీంతో రాహుల్ వివరణపై బీజేపీ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది