School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏకంగా 15 రోజులు సెలవులు ఎక్కడంటే
School Holidays: విద్యార్ధులు ఆనందంతో ఎగిరి గంతేసే వార్త ఇది. ఏకంగా 15 రోజులు సెలవులు వచ్చేశాయి. శీతాకాలం సెలవులు ఇచ్చేశారు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పట్నించో తెలుసుకుందాం. సంక్రాంతికి ముందే సెలవులు రావడంతో విద్యార్ధుకు ఆనందపడుతున్నారు.
School Holidays: సాధారణంగా పండుగ సెలవులు లేదా వేసవి సెలవులుంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో శీతాకాల సెలవులుంటాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతోంది. చలితీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రాల్లో ఏకంగా 15 రోజులు స్కూళ్లకు సెలవులిచ్చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఢిల్లీలో చలి తీవ్రత కారణంగా స్కూళ్లకు సెలవులిచ్చేశారు. జనవరి 1 నుంచి జనవరి 15 వరకూ దేశ రాజధానిలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో సెలవులిస్తుంటారు. ఈసారి డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకూ వింటర్ హాలిడేస్ ప్రకటించింది యూపీ ప్రభుత్వం.
దేశ రాజధాని ఢిల్లీకు ఆనుకుని ఉన్న హర్యానాలో కూడా చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. చలిగాలులు అధికమౌతున్నాయి. దాంతో శీతాకాల సెలవులిచ్చేందుకు హర్యానా ప్రభుత్వం సిద్దమైంది. గత ఏడాది జనవరి 1 నుంచి జనవరి 15 వరకూ సెలవులిచ్చారు. ఈసారి అంతకంటే ముందే డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకూ సెలవులుంటాయని తెలుస్తోంది.
జమ్ము కశ్మీర్‌లో స్కూళ్లకు సెలవులిచ్చేశారు. జమ్ము కశ్మీర్‌లో చలి తీవ్రత చాలా ఉంది. ఇప్పటికే డిసెంబర్ 10 నుంచే సెలవులిచ్చేశారు. 5వ తరగతి విద్యార్ధులు ఇప్పటికే సెలవులున్నాయి. ఇక 6 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు డిసెంబర్ 16 వరకూ సెలవులిచ్చేశారు. ఫిబ్రవరి 28 వరకూ ఈ స్కూళ్లు తిరిగి తెర్చుకునే పరిస్థితి లేదు. జమ్ము కశ్మీర్‌లో శీతాకాల సెలవులు ఏకంగా రెండు నెలలు పైగా ఉండటం సహజమే. ఇక పంజాబ్‌లో శీతాకాల సెలవులు తాజాగా ప్రకటించారు. ఈ నెల అంటే డిసెంబర్ 24 వరకూ సెలవులు ప్రకటించారు. ఈ నెలాఖరు వరకూ ఈ సెలవులుంటాయి. ఆ తరువాత పరిస్థితిని బట్టి సెలవులు కొనసాగనున్నాయి.
Also read: Public Holidays 2025: కొత్త ఏడాదిలో బ్యాంకులు, ఆఫీసులు, విద్యాలయాల సెలవులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.