కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 6వ విడత పోలింగ్ సైతం హింసాత్మకంగా మారింది. బంకురాలోని 254వ పోలింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు రిగ్గింగ్‌కి పాల్పడుతున్నారని బీజేపి కార్యకర్తలు ఆరోపించడం ఘర్షణకు దారితీసింది. బీజేపి, టీఎంసి కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు.