Secunderabad Lok Sabha Election Result 2024: సికింద్రాబాద్ సికిందర్ ఎవరు..? లష్కర్ ఫలితంపై ఉత్కంఠ.. ?
Secunderabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే హవా కొనసాగుతోంది. ఇక సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మరోసారి విజయ కేతనం ఎగరేయనున్నారా ? అనేది ఆసక్తికరంగా మారింది.
Secunderabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ హవా నడుస్తోంది. అటు తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లోని బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్నారు. అటు సికింద్రాబాద్ స్థానానికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ AV కాలేజ్ లో కొనసాగుతోంది. అక్క మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దానం నాగేందర్ పై 3325 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే.. ఆ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందన్న సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి అది రిపీట్ అవుతూ వస్తోంది. 1998 నుంచి ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరుపున బండారు దత్తాత్రేయ గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున కిషన్ రెడ్డి తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుపు కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీగా బరిలో ఉన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో దిగారు. మరోవైపు బీఆర్ఎస్ తరుపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ పోటీ పడ్డారు. ఇందులో కిషన్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ అన్నట్లుగా సాగుతోంది. ఫైనల్ గా ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రి కమ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి గెలుస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook