Security increased for gangster Lawrence Bishnoi due to Sidhu Moose Wala funeral: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఢిల్లీలోని తీహార్ జైలులో భద్రతను పెంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈరోజు స్వగ్రామం మూసాలో వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య సిద్ధూకు తుది వీడ్కోలు పలికారు. అంత్యక్రియల కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చిన నేపథ్యంలో తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్‌కు సెక్యూరిటీ పెంచారు. జైలు బయట మాత్రమే కాకుండా లోపల కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఆదివారం సాయంత్రం సిద్ధూ మూసేవాలా తన మిత్రులతో కలిసి SUV కార్లో వెళ్తుండగా.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. తండ్రి బల్‌కౌర్‌ సింగ్‌ చూస్తుండగానే.. దుండగులు సిద్ధూను దారుణంగా కాల్చిచంపారు. చాలా దగ్గర నుంచి 30 రౌండ్లు కాల్పులు జరపడం ద్వారా.. సిద్ధూ శరీరం మొత్తం తూట్లుగా మారిపోయింది. ఆయన మరణించారని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి దుండగులు వెళ్లిపోయారట. 24 బుల్లెట్లు సిద్ధూ శరీరం నుంచి డాక్టర్లు బయటకి తీశారు. 


సిద్ధూ మూసేవాలా తామే చంపామంటూ గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు కూడా పెట్టాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి హత్య చేసినట్టు ప్రకటించాడు. ఇప్పటికే పలు కేసుల కారణంగా తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిష్ణోయ్.. తనకు ఏం సంబంధం లేదన్నాడు. తనను కాపాడాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.విచారణ కోసం తనను పోలీసులకు అప్పగించవద్దు అని పటియాల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను నకిలీ ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందని కూడా కోర్టుకు తెలిపాడు. అయితే సిద్ధూ అంత్యక్రియల నేపథ్యంలో బిష్ణోయ్‌కు భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 


లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు. బిష్ణోయ్‌కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. వీరు ఇద్దరు పంజాబ్‌లో వసూళ్ల దందా నడుపుతూ ఉండేవారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో లారెన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. అయితే పలు కేసుల్లో లారెన్స్ అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకు వెళ్ళాడు. అనంతరం కెనడాకు పారిపోయిన గోల్డీ బ్రార్.. అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.


Also Read: Tamannaah Bhatia: అబ్బాయిగా మారిపోయిన తమన్నా భాటియా.. భారీ షాక్‌లో అభిమానులు!


Also Read: Bajaj Chetak eScooter: బజాజ్ చేతక్ గుర్తుందా..ఇప్పుడు సరికొత్త రూపంలో చేతక్ ఇస్కూటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి