Selfie Accident: సెల్ఫీ పిచ్చిలో పడి.. సంసారానికి పనికిరాకుండా పోయిన యువకుడు! విషయం తెలిస్తే షాక్ అవుతారు
Young Man hospitalized after electric shock while taking selfie. ఇటీవలి కాలంలో సెల్ఫీ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ పిచ్చిలో పడి సంసారానికి పనికిరాకుండా పోయాడు.
Young Boy hospitalized after electric shock while taking selfie: స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఫొటోస్ దిగడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా సెల్ఫీలు. కొందరు అయితే సమయం, సందర్భం అని చూడకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫీ ఒక భాగంగా మారిపోయింది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మధురమైన క్షణాలను స్మార్ట్ ఫోన్‌లలో బంధించడం మంచిదే కానీ.. సెల్ఫీ పిచ్చి అనర్థాలకు దారితీసే విధంగా మాత్రం ఉండకూడదు. ఇటీవలి కాలంలో సెల్ఫీ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ పిచ్చిలో పడి సంసారానికి పనికిరాకుండా పోయాడు.
ప్రభుత్వ రైల్వే పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సత్యప్ప తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక హుబ్బళ్లి నగరంలోని షిరాడీ నగర్‌లో ప్రభుత్వ బాయ్స్ హాస్టల్ ఉంది. హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థి వినాయక్ రవి కన్నన్నవర్ని (19)కి సెల్ఫీలు అంటే పిచ్చి. నిత్యం సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వినాయక్ తన స్నేహితులతో కలిసి మంగళవారం (డిసెంబర్ 7) ఉన్‌కల్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌లోఆగి ఉన్న గూడ్స్ రైలుపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవాలనుకున్నాడు. అందుకు స్నేహితులు కూడా ఎంకరేజ్ చేశారు.
వినాయక్ రవి ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి ఎక్కి ఫోటోలు దిగుతూ ఉన్నాడు. అక్కడ హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయని అని కూడా చూసుకోకుండా.. వాటికి దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగాడు. సెల్ఫీ తీసుకునే సమయంలో రవికి విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో ఒక్కసారిగా అతడి శరీరమంతా షాక్ వ్యాపించింది. షాక్ కారణంగా అతని మర్మాంగం కాలిపోయింది. వెంటనే రవిని అతడి స్నేహితులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రవి ప్రాణాలతో బయటపడ్డాడు కానీ.. సంసారానికి పనికిరాకుండా పోయాడు. సంసార జీవితానికి రవి పనికిరాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Also Read: IND Vs BAN: రెండో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ బంగ్లాదేశ్ సొంతం!
Also Read: KGF Actor Died: కేజీఎఫ్ నటుడు కన్నుమూత.. రాఖీభాయ్ పవరేంటో చూపాడు ఈ తాత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.