ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) చివరి దశ ప్రయోగాల నిలిపివేతపై మరో భాగస్వామ్య కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) స్పందించింది. భారత్ లో ప్రయోగాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచమంతా ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో బ్రిటన్ ( Britain ) లో జరుగుతున్న మూడోదశ ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా ( Astrazeneca ) ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. అయితే ఈ విషయంపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) వివరణ ఇచ్చింది. ఎందుకంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, మార్కెటింగ్ ఒప్పందం సీరమ్ ఇనిస్టిట్యూట్ తోనే జరిగింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్ ను భారత్ లో నిలిపివేయలేదని...ఆ పరీక్షలు కొనసాగుతున్నాయని వివరించింది. ప్రస్తుతానికి బ్రిటన్ లో పరీక్షల్ని నిలిపివేసినా..త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇండియాలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వెల్లడించింది.


ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ లో టీకా తీసుకున్న వాలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రత ( Vaccine safety ) పై పూర్తి స్థాయి సమీక్ష కోసం ట్రయల్స్ ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఈ నేపధ్యంలో భారత్ లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో  జరుగుతున్న ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ సంగతేంటనే అనుమానం కలిగింది. ఈ అనుమానాల్ని నివృత్తి చేస్తూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ ప్రకటన చేసింది. ఇండియాలో పరీక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. Also read: Kangana Ranaut: ఉద్ధవ్ థాకరే..ఇదే నీకు నా ఛాలెంజ్