EU Green Pass: యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య వివాదం సద్దుమణిగింది. భారతదేశ హెచ్చరికలతో ఈయూ దిగొచ్చింది. భారత ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ అందిస్తూ..ఈయూలోని ఏడు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యాక్సిన్ పాస్‌పోర్ట్(Vaccine Passport) విషయంలో యూరోపియన్ యూనియన్‌కు భారత దేశ ప్రభుత్వానికి మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణీకులకు జూలై 1 నుంచి వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అంటే గ్రీన్‌పాస్ (Green Pass)తప్పనిసరి చేసింది ఈయూ. దీన్నీ ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికే ఈ గ్రీన్‌పాస్ జారీ అవుతుంది. ఇది ఉంటేనే ఈయూ సభ్యదేశాల మధ్య రాకపోకలు లేదా ఈయూ దేశాలకు ప్రయాణం సాధ్యమవుతుంది. ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్(Covishield) , కోవాగ్జిన్‌లకు జాబితాలో చేర్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వం (Central government)ఆగ్రహించింది. తమ వ్యాక్సిన్లను అనుమతించకపోతే..ఈయూ దేశాల ప్రయాణీకుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని..కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని ఇండియా హెచ్చరించింది. ఫలితంగా ఈయూ దిగొచ్చింది. భారత ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ అందించింది. 


ఈయూ(Europian Union)లోని ఏడు సభ్యదేశాలైనా జర్మనీ, స్లోవేకియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్‌లు హడావిడిగా కోవిషీల్డ్‌(Covishield)కు అనుమతిస్తూ ప్రకటన చేశాయి. ఫలితంగా ఈ దేశాల ప్రయాణానికి మార్గం సుగమమైంది. తాజా పరిణామంతో మిగిలిన ఈయూ దేశాలు కూడా స్పందించే అవకాశముంది. కోవిషీల్డ్‌కు అనుమతిచ్చే అవకాశాలున్నాయి.


Also read: EU Vaccine Passport: ఈయూ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వ్యవహారం, ఇండియా - ఈయూ మధ్య పెరుగుతున్న వివాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook