అయ్యో పాపం.. ఒకరి కోసం ఆరుగురు కార్మికులు బలి !!
గుజరాత్ లోని వడోదర ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది
గుజరాత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో చిక్కుకున్న ఒక్కడిని కాపాడబోయి ..ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వడోదరలోని దభోయి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే దర్శన్ హోటల్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు పలువురు కూలీలను పిలిపించింది హోటల్ యాజమాన్యం.
ట్యాంక్ క్లీన్ చేసేందుకు ముందుగా ఓ కూలీ ట్యాంక్ లోపలికి దిగాడు. అయితే అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో అతడ్ని వెతికేందుకు మిగతా ముగ్గురు కూలీలు కూడా ట్యాంక్ లోపలికి వెళ్లారు. వీళ్లూ కూడా తిరిగి రాకపోవడంతో హోటల్‌లో పనిచేసే ముగ్గురు సిబ్బంది కూడా ట్యాంక్‌లోకి దిగారు
ఇలా వెళ్లినవారంతా ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. ఏదో జరిగి ఉంటుందనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎమర్జెన్సీ సిబ్బంది సాయంతో ఏడుగురు మృతదేహాలను వెలికి తీశారు.
ఈ ఘటనపై జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ కిరణ్ జావేరి స్పందిస్తూ ట్యాంక్‌లో వెలువడిన విషవాయువు పీల్చడంతో వీరంతా ఊపిరాడక మృతిచెందినట్లు పోలీసులు ప్రాధామిక నిర్ధారించారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి హోటల్ యజమానికి అదుపులోకి తీసుకున్నారు. మతుల్లో నలుగురు పారిశుధ్య కార్మికులలతో పాటు ముగ్గురు హోటల్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.