న్యూ ఢిల్లీ: సెక్స్ రాకెట్‌కి పాల్పడిన గీతా అరోరా అలియాస్ సోనూ పంజాబన్‌కి ( Sex racketeer Sonu Punjaban ) ఢిల్లీలోని ద్వారకా కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ తదితర నేరాలకు పాల్పడినందుకుగానూ ఈ శిక్ష విధిస్తున్నట్టు ఢిల్లీ కోర్టు స్పష్టంచేసింది. పోక్సో యాక్టుతో ( POCSO act ) పాటు ఐపిసి యాక్ట్స్ 328, 342, 366A, 372, 373, 120B కింద ఆమెకు ఈ శిక్ష విధించినట్టు కోర్టు తెలిపింది. సెక్స్ రాకెట్‌లో ( Sex racket ) సోనూకి భాగస్వామిగా వ్యవహరించిన సందీప్ బెడ్వాల్‌కి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.64 వేల జరిమానా విధిస్తున్నట్టు ద్వారకా కోర్టు తీర్పు చెప్పింది. సోనూ పంజాబన్‌తో కలిసి నేరాల్లో పాల్పంచుకున్నందుకుగాను ఐపిసి యాక్ట్స్ 363, 366, 366A, 372, 376, 120B కింద సందీప్‌కి శిక్షను ఖరారు చేసినట్టు కోర్టు వెల్లడించింది. ( Also read : TSPSC recruitment: టిఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2009లో ఓ 12 ఏళ్ల బాలికను ప్రేమించినట్టు నమ్మించిన సందీప్.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సీమ అనే మహిళ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసిన సందీప్.. బాలికను సీమకు విక్రయించాడు. అనంతరం బాలికతో కొంతకాలం పాటు వ్యభిచారం ( Prostitution ) చేయించిన సీమ.. ఆ తర్వాత బాలికను సోనూ పంజాబన్‌కి అమ్మేసింది. అక్కడి నుంచి బాలికపై లైంగిక వేధింపులు ( Sexual harassments ) మరింత అధికమయ్యాయి. 


బాలికతో వ్యభిచారం చేయించిన సోనూ పంజాబన్.. ఆమెను విటుల వద్దకు పంపడాని కంటే ముందుగా ప్రాక్సీవాన్, అల్ప్రెక్స్ వంటి డ్రగ్స్ ( proxyvon, alprex tablets ) తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసేది. ( Also read: Tea Seller: ఛాయ్‌వాలా బ్యాంక్ లోన్ రూ.50 కోట్లా! )


సోనూ పంజాబన్ అరాచకాలు గురించి తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు ( Delhi police ).. 2017లో దాదాపు 6 నెలల పాటు ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్‌ డీలింగ్స్‌లో సోనూ పంజాబన్ నెట్‌వర్క్ ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ సెక్స్ రాకెట్‌లో భాగస్వామ్యం ఉన్న వారి కోసం ఇప్పటికీ ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.( Also read: Telangana: 50 వేలకు చేరువలో కరోనా కేసులు )