పెళ్లికి రోడ్డు బ్లాక్ చేస్తే ఊరుకుంటామా..?
పెళ్లికి రోడ్డు బ్లాక్ చేస్తే ఊరుకుంటామా..? ఢిల్లీ షహీన్ భాగ్ లో రెండోసారి కాల్పులు జరిపి పట్టుబడ్డ వ్యక్తి ... పోలీసుల విచారణలో చెప్పిన సమాధానం ఇది. నిన్న షహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వారిపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు .
పెళ్లికి రోడ్డు బ్లాక్ చేస్తే ఊరుకుంటామా..? ఢిల్లీ షహీన్‌భాగ్ లో రెండోసారి కాల్పులు జరిపి పట్టుబడ్డ వ్యక్తి ... పోలీసుల విచారణలో చెప్పిన సమాధానం ఇది. నిన్న షహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వారిపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు . అతన్ని పట్టుకున్న పోలీసులు . . స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. అతన్ని ఢిల్లీలోని దల్లుపురాకు చెందిన కపిల్ గుజ్జర్ గా గుర్తించారు. అతడు నోయిడాలోని ఓ ప్రయివేట్ కాలేజీలో చదువుతున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. షహీన్‌బాగ్ లో కాల్పులు జరిపిన స్థలం నుంచి కాల్చిన బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలు ఏం జరిగింది..?
షహీన్‌బాగ్ లో ఎందుకు కాల్పులు జరిపావని కపిల్ గుజ్జర్‌ను పోలీసులు ప్రశ్నించగా . . అతడు తేలిగ్గా ఓ విషయం చెప్పాడు. మరికొద్ది రోజుల్లోనే అతని మరదలి పెళ్లి ఉందట.. అందుకోసం అతడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందుకోసం రోజూ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోందట. అందు వల్ల పెళ్లి పనుల ఏర్పాట్లలో జాప్యం జరుగుతోందని విచారణలో చెప్పాడు. కపిల్ గుజ్జర్ చెప్పిన సమాధానం విని పోలీసులు నవ్వుకున్నారు. కానీ అతనిపై చట్ట ప్రకారం ఎఫ్ఐర్ నమోదు చేశారు.
మరోవైపు రెండు రోజుల్లోనే రెండుసార్లు నిరసనకారులపై కాల్పులు జరిగిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. షహీన్‌బాగ్ చట్టు పక్కల భారీ భద్రత కేటాయించారు.