Sharad pawar on Sachin tendulkar: ప్రముఖుల ప్రతిష్ఠను కేంద్రం పణంగా పెడుతోంది
Sharad pawar on Sachin tendulkar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వ్యవహారంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్..సచిన్‌పై విమర్శలు చేశారు.
Sharad pawar on Sachin tendulkar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వ్యవహారంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్..సచిన్‌పై విమర్శలు చేశారు.
వ్యవసాయ చట్టాల ( New farm laws )పై ట్వీిట్ వార్ కొనసాగుతోంది. అంతర్జాతీయ సెలెబ్రిటీలు ఓ వైపు ..దేశీయంగా ఉన్న సెలెబ్రిటీలు మరోవైపు నిలిచారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ( Farmers protest ) కు అంతర్జాతీయ సెలెబ్రిటీలైన రిహన్నా ( Rihanna ), గ్రేటా థన్‌బర్గ్ ( Greta Thunberg ), ఖలీఫా తదితరులు మద్దతిచ్చారు. వీరిపై జాతీయ ప్రముఖులు కొందరు కౌంటరిచ్చే క్రమంలో రైతు చట్టాలకు మద్దతుగా మాట్లాడారు. తమ
దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) ఇవే వ్యాఖ్యలు చేసి ట్రోల్ అయ్యారు. దేశ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవల్సిన అవసరం లేదని..తమ సమస్యల్ని పరిష్కరించుకునే సత్తా తమకుందని సచిన్ తెలిపారు. రైతు ఆందోళనకు మద్దతిచ్చినవారిని విమర్శించడంతో సోషల్ మీడియాలో సచిన్‌పై కామెంట్లు పెరిగాయి. అన్నదాతలకు వ్యతిరేకంగా..కేంద్ర ప్రభుత్వానికి ( Central Government ) మద్దతుగా నిలవడాన్ని తప్పుబడుతున్నారు.
ఇప్పుడు కొత్తగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ( NCP Chief Sharad Pawar ) స్పందించారు. ఏదైనా అంశంపై మాట్లాడేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చురకలంటించారు. దేశంలోని చాలామంది సెలెబ్రిటీల తీరుపై చర్చ జరుగుతోందని..పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. అటు ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే ( Raj Thackeray ) కూడా సచిన్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్‌ల ప్రతిష్ఠను వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పణంగా పెట్టిందన్నారు. కేవలం పోస్టుల కారణంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారన్నారు.
Also read: HCL Recruitment : హెచ్‌సీఎల్ విజయవాడలో భారీగా ఉద్యోగాలు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook