శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వం రద్దైంది. ఆయన జనతాదళ్(యునైటెడ్) (జేడీ(యూ)) తరుపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి  తెలిసిందే..! జేడీ(యూ) దాఖలు చేసిన పిటీషన్ ను పరిశిలించిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.


శరద్ యాదవ్ ను రాజ్యసభకు ఎన్నుకున్న ఆయన పార్టీ జేడీ(యూ) సభ్యత్వాన్ని స్వచ్చందగా వదులుకున్నారని.. తద్వారా ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయారని రాజ్యసభ ఛైర్మన్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనతోపాటు అలీ అన్వార్ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన సభ్యత్వాన్ని కూడా  రద్దు చేసినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి.