కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మృతి చెందారు. ఈ  విషయం ఒక ప్రముఖ టీవీ ఛానల్ పేర్కొనడంతో అందరూ సానుభూతి ప్రకటించారు. తీరా విషయం తెలుసుకొని క్షమాపణ కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. సోమవారం బాలీవూడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన శశికపూర్ అనారోగ్య కారణాలవల్ల ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే..! ఇదే విషయాన్ని ఒక జాతీయ టీవీ ఛానల్ తన ట్విట్టర్ ఖాతాలో శశికపూర్ కు బదులు శశిథరూర్ మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఇకఅంతే.. ఆయన ఆఫీసుకు, కుటుంబసభ్యులకు సానుభూతి పరామర్శలు వెల్లువెత్తాయి.


విషయం తెలుసుకున్న శశిథరూర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "శశికపూర్ చనిపోవడం బాధగా ఉంది. కొందరు నేను చనిపోయాను అనుకొని నా ఆఫీసుకు, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. నాకు ఏమీ కాదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. శశికపూర్ కుటుంబసభ్యులకు, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ పేర్కొన్నారు.


జరిగిన తప్పుకు సదరు టీవీ ఛానల్ క్షమాపణ కోరగా శశిథరూర్ సానుకూలంగా స్పందించారు.