Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు షాక్..మరోసారి జ్యుడిషియల్ కస్టడీ..!
Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Sanjay Raut: పాత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈకేసులో ఆయనను మరో 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గోరేగావ్ శివారులోని పాత్రాచాల్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేసింది. ఈకేసులో భాగంగా ఆగస్టు 1న సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు ఈనెల 4 వరకు ఈడీ కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆ తర్వాత కస్టడీని ఈనెల 8వ వరకు పొడిగించింది. ఇవాళ తాజాగా సంజయ్ రౌత్‌ను మరోమారు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈకేసులో విచారణకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరలేదు. దీంతో ఆయనను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ప్రత్యేక కోర్టు అప్పగించింది.
కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందుల కోసం రౌత్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుని..అనుమతి ఇచ్చింది. ఐతే ప్రత్యేక గది కేటాయించేందుకు నిరాకరించింది. జైలు నియమ నిబంధనల ప్రకారం జైలులో గదిని ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. కేసు విచారణలో భాగంగా సంజయ్ రౌత్ భార్య వర్షారౌత్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఇందులోభాగంగా శనివారం ఆమెను ఈడీ అధికారులు విచారించారు.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వాయు'గండం'..రాగల మూడు రోజులపాటు తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook