ముంబై: ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాకగాంధీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రసంశల వర్షం కురిపించారు. ఇరువురు ఎన్నికల్లో బాగా కష్టపడ్డారని కితాబిచ్చారు. వారు పడ్డ కష్టానికి ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తప్పకుండా వస్తుందని ఎద్దేవ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సందర్భంలో ఎన్డీయే విజయంపై ఉద్ధవ్ థాక్రే ధీమా వ్యక్తం చేశారు.  ప్రధాని మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ప్ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయే పక్షాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపగా..ప్రతిపక్షాలకు చేధు అనుభవాన్ని మిగిల్చాయని  పేర్కొన్నారు. తన పార్టీ పత్రిక సామ్రాలో ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కూటమి విజయంపై ధీమాతో థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.


మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపు ఎన్డీయేవైపు మొగ్గుచూపడంతో బీజేపీ, ఎన్డీయే పక్షాల్లో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుండగా..యూపీఏ, ఇతర పక్షాలు తమ గెలుపుపై నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.