ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిత్రపక్షమైన బీజేపిని పక్కనపెడుతూ శివసేన ఒంటరిపోరుకే సిద్ధమవుతోంది. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే శివసేన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ఒంటరిపోరుకి సిద్ధంగా ఉండాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఒకవేళ పొత్తు కుదిరితే, కలిసి పోటీ చేస్తేనే బాగుంటుందని భావిస్తున్న ఉద్ధవ్ థాకరే.. పొత్తు కుదరని పక్షంలో ఒంటరిగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంటుందని పార్టీ నేతలకు సూచించారని తెలుస్తోంది.


మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా శివసేనకు కేవలం 106 స్థానాలు మాత్రమే కేటాయించాలని బీజేపి భావిస్తోంది. సరిగ్గా ఈ విషయంలోనే శివసేన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు పార్టీ నేత ఒకరు జీ మీడియాకు తెలిపారు.