బీజేపీ చీఫ్ అమిత్ షా కు శివసేన పార్టీ ఊహించని విధంగా ఝలక్ ఇచ్చింది. ఎన్నికల కోసం మిత్రులను కూడగట్టే కార్రక్రమంలో భాగంగా అమిత్ షా ఈ రోజు సాయంత్రం శివసేన అధ్యక్షుడు ఉద్దేవ్ థాక్రేతో భేటీ కావాల్సి ఉంది. ఠాక్రేను ఏదో రకంగా  బుజ్జగించి కలుపుకుపోవాలనే లక్ష్యంతో భేటీకి సిద్ధమౌతున్న తరుణంలో 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండబోదని శివసేన సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని సామ్నా సంపాదకీయం రూపంలో ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంటిరిగా పోటీ చేసే సత్తా ఉంది..
శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో  2019 సాధారణ ఎన్నికలను సొంతంగానే ఎదుర్కొనే సత్తా శివసేనకు ఉందని ప్రకటించింది. ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉప ఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావించి ఈ పోలింగ్ ఫలితాలు  ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదనే అభిప్రాయం తెలియజేసింది. ఎన్నికల్లో గెలుపొందేందుకు తమకు ఎలాంటి పోస్టర్ బోయ్ అవసరం లేదని బీజేపీ చీఫ్ ను ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవ  చేసింది.


బీజేపీ తీరుపై విమర్శలు


ఇదే సందర్భంలో బీజేపీపై విమర్శలు గుప్పించింది.  బీజేపీ అధికారంలో ఉండి కూడా ప్రజలతో సంబంధాలను కోల్పోయిందని...కానీ అందుకు భిన్నంగా శివసేన ప్రజలతో మమేకమవుతూ ప్రజల ప్రయోజనం కోసం పనిచేస్తోందని  సమర్ధించుకుంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీ ఎందుకని సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమం చేస్తోంది ?  అని ప్రశ్నించింది.  


అమిత్ షా యాత్ర దేని కోసం ?


సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో దేశవ్యాప్తంగా పలు వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే షా మొన్న రాందేవ్ బాబాను కలుసుకొని ఆయన  మద్దతు కూడగట్టిన అమిత్ షా.. మహారాష్ట్ర పర్యటనలో  ఈ రోజు బాలీవుడ్ బ్యూటీ  మాధురీదీక్షిత్ ను ముంబైలో కలుసుకున్నారు. కాగా సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంత్రం శివసేన చీఫ్ ఉద్దేవ్ ఠాక్రేతో భేటీ ఖరారు చేసుకున్న తరుణంలో అమిత్ షాకు శిశసేన ఇలా షాక్ ఇచ్చింది.