Litre Petrol for Just Rs.1 : పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెరిగిన పెట్రోల్ ధరలపై లబోదిబోమంటున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. సోమవారం (ఏప్రిల్ 25) స్థానిక శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ పుట్టినరోజు కావడంతో... అక్కడి శివసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేపట్టారు. థానేలోని తత్వజ్ఞాన్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న కైలాష్ పెట్రోల్ బంక్‌లో ఈ పంపిణీ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు 1000 మంది వాహనదారులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు. రూపాయికే లీటర్ పెట్రోల్ అని తెలియడంతో భారీ ఎత్తున వాహనదారులు అక్కడకు చేరుకున్నారు. థానే మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కార్పోరేటర్ ఆశా డోంగ్రే, సామాజిక కార్యకర్త సందీప్ డోంగ్రే, అబ్దుల్ సలాం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని... అలాగే పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసన తెలిపేందుకు ఇలా రూ.1కే పెట్రోల్ పంపిణీ చేపట్టినట్లు వీరు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1,20,000 వరకు ఖర్చు అయినట్లు తెలిపారు.


ఇటీవల ఇదే మహారాష్ట్రలోని సోలాపూర్‌లోనూ రూ.1కే లీటర్ పెట్రోల్‌ను ఓ పెట్రోల్ బంకులో విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ స్టూడెంట్స్ అండ్ యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ రూ.1కేపెట్రోల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా, గత 19 రోజులుగా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల మేర పెరిగాయి. దీంతో 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.10 మేర పెరిగినట్లయింది. 


Also Read: Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవం..!


Also Read: రషీద్ ఖాన్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్ కోచ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.