Assam Floods: అసోంలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Heavy rains in Assam) భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఈ వరదల కారణంగా కొండ ప్రాంతాలలో రైల్వే ట్రాక్లు, వంతెనలు మరియు రహదారి కమ్యూనికేషన్లకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 4లక్షలకుపైగా ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) బులెటిన్ ప్రకారం, 26 జిల్లాల పరిధిలోని 1,089 గ్రామాల్లో దాదాపు 1,900 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి మరియు 39,558 మందికి పైగా ప్రజలు 89 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ భారీ వర్షాలకు డిమా హసావోలోని న్యూ హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ (Haflong Station) నీటమునిగింది. దీని యెుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడి భయానక పరిస్థితులను ఈ వీడియో కళ్లకు కడుతోంది. ఇదిలా వుండగా, ఉదల్‌గురి జిల్లాలో మరో వ్యక్తి మరణించడంతో, ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 8కి చేరింది. అంతేకాకుండా, వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి ప్రభుత్వం పారామిలటరీ బలగాలు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించింది. 


Also Read: Gyanvapi Masjid Video: సంచలనం రేపుతున్న వీడియో.. జ్ఞానవాపి మసీదులో నంది విగ్రహం!


అసోంలోని వరద పరిస్థితిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా (Amit Shah)..అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ఫోన్ చేసి చర్చించారు. . ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని...కేంద్ర ప్రభుత్వం నుండి అన్నివిధాల సహాయమందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్స్ చేశారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook