టెర్రరిస్టులను సత్యాగ్రహంతో డీల్ చేయాలా: అరుణ్ జైట్లీ
ఒకరిని చంపడమో లేదా తామే చావడమో చేసే టెర్రిరిస్టులను సత్యాగ్రహంతో డీల్ చేయాలా అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు.
ఒకరిని చంపడమో లేదా తామే చావడమో చేసే టెర్రిరిస్టులను సత్యాగ్రహంతో డీల్ చేయాలా అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. "ఒక వైపు టెర్రరిస్టులు ఒత్తిడికి గురవుతూ కూడా సరెండర్ అవ్వకుండా.. ఎదురు కాల్పులు చేస్తుంటే.. చట్టరీత్యంగా మాత్రమే అన్ని జరుగుతాయి. అప్పుడు ఏది చేయాలో అదే మేం చేయాల్సి ఉంటుంది. అంతే కానీ సత్యాగ్రహం చేస్తూ కూర్చోలేం" అని జైట్లీ అన్నారు.
ఒకవైపు దుండగుడు చంపడానికి ముందుకొస్తుంటే.. వాడితో చర్చలు జరుపుతూ కూర్చోలేం కదా అని జైట్లీ అన్నారు. కాశ్మీరులో ఎలాంటి పాలసీలు ఉన్నా..
అక్కడి సామాన్య ప్రజలను రక్షించడమే తమ అభిమతమని జైట్లీ తెలిపారు. వారిని తీవ్రవాదుల నుండి కాపాడాల్సిన బాధ్యత కూడా తమ మీద ఉందని.. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేవారిని ఎదుర్కొంటూనే.. ప్రజలను తాము కాపాడతామని జైట్లీ అభిప్రాయపడ్డారు.
మానవ హక్కు సంఘాల ముసుగులో కొన్ని సంస్థలు కాశ్మీరు, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని.. అవి మానవ హక్కులు అనే మాటకే కళంకం తీసుకొస్తున్నాయని అరుణ్ జైట్లీ విమర్శించారు.కానీ తాము మాత్రం భారతదేశంలోని ప్రతీ పౌరుడి మానవ హక్కులను కాపాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటామని జైట్లీ తెలిపారు.