Adar Poonawalla: కోవిడ్19 వ్యాక్సినేషన్ ఇప్పట్లో పూర్తి కాదు, సీరం సీఈవో ఆదార్ పూనావాలా
SII CEO Adar Poonawalla : తమకు భారత ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, వారి శ్రేయస్సును కాదని విదేశాలకు కోవిడ్19 వ్యాక్సిన్ ఎగుమతి చేయడానికి ప్రయత్నించలేదన్నారు. జనాభాలో భారత్ రెండో అతిపెద్ద దేశమని, కేవలం రెండు మూడు నెలల్లో దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
భారత్‌లో కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న పుణేకు చెందిన సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) సీఈవో ఆదార్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారత ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, వారి శ్రేయస్సును కాదని విదేశాలకు కోవిడ్19 వ్యాక్సిన్ ఎగుమతి చేయడానికి ప్రయత్నించలేదన్నారు. జనాభాలో భారత్ రెండో అతిపెద్ద దేశమని, కేవలం రెండు మూడు నెలల్లో దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడానికి రెండు నుంచి మూడేళ్లు సమయం పడుతుందని సీరం ముఖ్యకార్యనిర్వాహక అధికారి ఆదార్ పూనావాలా వ్యాఖ్యానించారు. ప్రపచంలోనే జనాభాలో తమది రెండో అతిపెద్ద దేశమని దేశ ప్రజలు తెలుసుకోవాలని, కేవలం 2-3 నెలల్లో మొత్తం ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత త్వరగా ముగియదని ప్రజలు సైతం గుర్తించాలన్నారు. సీరం సంస్థ ఇప్పటికే 200 మిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి పంపిణీ చేసిందని SII CEO Adar Poonawalla గుర్తుచేశారు.
Also Read: COVID-19 Vaccine: భారత్‌లో కరోనా వేరియంట్లపై ఏ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో తెలుసా
అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన తరువాత అమెరికా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించాయి. అయితే రెండు నెలలు ఆలస్యంగా తాము వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలుపెట్టినా భారీ సంఖ్యలో డోసులు సరఫరా చేశామని, తద్వారా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచామని సీరం సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. భారత్‌కు ప్రాధాన్యమిస్తూ తాము వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, ఈ ఏడాది చివరల్లో కోవాక్స్ ఉత్పత్తి చేసి విదేశాలకు సైతం సరఫరా చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి
కరోనా తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసిందన్నారు. అయితే ఇది కేవలం ఒకదేశానికి చెందిన సమస్య కాదని, కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రపంచ దేశాలలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్లు కావాలని డిమాండ్లు, బెదిరింపులు రావడంతో ఆదార్ పూనావాలా యూకేకు వెళ్లిపోవడం తెలిసిందే. తాను కొన్ని రోజుల తరువాత భారత్‌కు తిరిగి రానున్నట్లు సైతం ఇటీవల వెల్లడించారు.
Also Read: COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook