1 year Maternity Leave, 1 Month Paternity Leave: వావ్.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1 ఏడాది మెటర్నిటీ లీవ్.. 1 నెల పెటర్నిటీ లీవ్
1 year Maternity Leave, 1 Month Paternity Leave: మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళకు 6 నెలలు లేదా 26 వారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవును తప్పనిసరిగా మంజూరు ఉంటుంది. ప్రసూతి చట్టం ప్రకారం, కనీసం 80 రోజుల పాటు ఒక సంస్థలో పనిచేసిన మహిళలకు ఈ మెటర్నిటీ బెనిఫిట్‌కి అర్హులు అవుతారు.
1 year Maternity Leave, 1 Month Paternity Leave Sikkim govt employees: న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నట్టు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు. సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (SSCSOA) యాన్వల్ జనరల్ బాడీ మీటింగ్ లో సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ పాల్గొని ప్రసంగిస్తూ, త్వరలోనే తమ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవు అమలు చేస్తామని అన్నారు. అలాగే పురుషులకు నెల రోజుల పాటు పెటర్నల్ లీవ్ ఇవ్వనున్నట్టు ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
" సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సెలవుల ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలు, కుటుంబాలను దగ్గరుండి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం " అని సిక్కిం సీఎం తమాంగ్ పేర్కొన్నారు.
సిక్కిం రాష్ట్ర అభివృద్ధిలో అధికారుల పాత్ర ఎంతో కీలకం అని చెప్పిన సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్.. అధికారులు పరిపాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచారు అని అన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారులకు పదోన్నతుల ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల సంఖ్య పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా భాగస్వాములైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులందరినీ అభినందించిన సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్... భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇండియాలో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏం చెబుతోందంటే..
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళకు 6 నెలలు లేదా 26 వారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవును తప్పనిసరిగా మంజూరు ఉంటుంది. ప్రసూతి చట్టం ప్రకారం, కనీసం 80 రోజుల పాటు ఒక సంస్థలో పనిచేసిన మహిళలకు ఈ మెటర్నిటీ బెనిఫిట్‌కి అర్హులు అవుతారు. అంతేకాకుండా, గర్భిణీలను ప్రెగ్నెన్సీని సాకుగా చూపించి యజమానులు వారిని పనిలోంచి తొలగించడం లేదా వారికి హాని కలిగించే పనులు అప్పగించడం వంటి ఆంక్షలకు పూనుకోకుండా గర్భిణిలకు రక్షణ అందిస్తుంది.
ఒకవేళ సిక్కిం రాష్ట్రం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తరహా మెటర్నిటీ, పెటర్నిటీ బెనిఫిట్స్ అందించిన తొలి రాష్ట్రంగా సిక్కిం రికార్డులలోకి ఎక్కనుంది. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో చర్చకు దారితీసింది. ఒకవేళ సిక్కిం ఈ నిర్ణయాన్ని అమలు చేసినట్టయితే.. మిగతా రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ డిమాండ్లలో ఈ తరహా మెటర్నిటీ లీవ్, పెటర్నిటీ లీవ్ అమలు చేయమని కోరే అవకాశాలు కూడా లేకపోలేదు.