Sikkim Flash Floods: ఈ ఏడాది వర్షాకాలం ఉత్తరాదిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఢిల్లీ వరదలు, హిమాచల్ వరదల నుంచి కోలుకునేలోగా సిక్కిం అతలాకుతలమైంది. మెరుపు వరదతో సిక్కిం వణికిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న సిక్కింలో వందలాదిమంది గల్లంతయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుపు వరదల బారిన పడిన సిక్కిం ఇంకా ఆ ప్రభావం నుంచి కోలుకోలేదు. ఇంకా ఇప్పటికీ వరద ప్రవాహంలోనే చిక్కుకుంది. అక్టోబర్ 3వ తేదీన రాష్ట్రంలో ఎత్తైన హిమానీ నది సరస్సు ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో భారీగా వరద వచ్చి పడింది. దీనికితోడు క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా రోడ్లు , వంతెనలతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడంతో పూర్తి స్థాయి సమాచారం తెలియడం లేదు. వరదలొచ్చి ఆరు రోజులైనా ఇంకా చాలామంది సహాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి.


మరోవైపు సిక్కిం వరదల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 77 మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించగా 29 మృతదేహాల్ని వెలికితీశారు. వందలాది మంది గల్లంతయాయారు. ఆచూకీ తెలియనివారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2500 మందిని రక్షించారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ కష్టమౌతోంది. ఉత్తర సిక్కిం ప్రాంతంలో ఇంకా 3 వేలమంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ రెస్క్యూ  టీమ్ రోప్ వే ద్వారా 52 మందిని రక్షించగలిగారు. 


ఈలోగా సిక్కిం దిగువన పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో 48 మృతదేహాల్ని గుర్తించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. సిక్కిం వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించిందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ పునరుద్ధరించాల్సి ఉంది. ఓ వైపు సహాయం కోసం నిరీక్షణ, మరోవైపు రాత్రయితే అంధకారం కారణంగా పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. 


Also read: YS Sharmila: విలీనం లేనట్టే, ఒంటరిగా బరిలో దిగనున్న షర్మిల, 119 స్థానాల్లో పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook