Lemons Price: ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు నిమ్మరసంతో చేసిన షర్బత్ తాకుతుంటారు. అందుకే నిమ్మకాయ రసాన్ని సామాన్యుడి కూల్​ డ్రింక్​ గా పిలుస్తుంటారు. అయితే సామాన్యుడికి ఈ సారి నిమ్మకాయలు కొనడం కూడా భారంగా మారుతున్నాయి. బుధవారం నాడు రాజస్థాన్​లోని జైపూర్​లో కిలో ధర రూ.400కు విక్రయమవుతోంది. మంగళవారం నాడు రూ.340గా ఉన్న కిలో నిమ్మకాయల ధర గడిచిన 24 గంటల్లోనే రూ.60 పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై స్థానిక స్థానిక కూరగాయల వ్యాపారి స్పందించారు. స్థానికంగా నిమ్మకాయల ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్లే ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి నిమ్మకాయలు తెచ్చుకుందామన్నా.. డీజిల్ ధరలు భారీగా పెరగటం వల్ల రవాణా కూడా భారంగా మారుతున్నట్లు తెలిపారు. ఈ కారణాలన్నీ నిమ్మకాయల ధరలు ఆకాశన్నంటుతున్నట్లు వివరించారు.


ధరలు పెరగటం వల్ల ఒక నిమ్మకాయ ధర జైపూర్​లో రూ.30 వద్దకు చేరిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరగటం సామాన్యులకు ఓ పీడకల అంటున్నారు విశ్లేషకులు.


సాధారణంగా ఎండలు భారీగా పెరుగతున్నప్పుడు చాలా మంది నిమ్మ రసం తాగేందుకు మొగ్గు చూపుతుంటారని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. అయితే డిమాండ్​కు తగ్గ సరఫరా లేకపోవడంతో గత రెండు వారాల క్రితం కిలో రూ.140-150 వద్ద ఉన్న నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా.. రూ.220-240 వరకు పెరిగినట్లు చెబుతున్నారు.


కూరగాయల ధరలు ఈ స్థాయిలో పెరుగుతుండటంపై సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పెరిగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్నారు గానీ.. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ముక్త మిట్టల్ అనే మహిళ అన్నారు.


నిమ్మ దిగుమతి ఎందుకు తగ్గింది?


అయితే సాధారణంతో పోలిస్తే.. నిమ్మ దిగుమతి తగ్గటంపై  వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పందిస్తున్నారు. అకాల వర్షాలు, ఉన్నఫలంగా వాతావరణంలో మార్పుల కారణంగా నిమ్మ దిగుబడి గతంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు చబుతున్నారు. నిమ్మ మాత్రమే కాకుండా.. వివిధ కూరగాయల దిగుబడి కూడా భారీగా తగ్గిందని ఫలితంగా రేట్లు భారీగా పెరిగినట్లు వివరిస్తున్నారు.


Also read: Indian Railways Latest News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఆ సేవలు ప్రారంభం


Also read: Coronavirus XE Variant: భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook