రామాయణం మీద కనీస అవగాహన ఉన్నవారికెవరికైనా ఈ విషయం బాగా తెలుసు. సీతను అపహరించింది రావణుడని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ గుజరాత్‌లోని పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాల్లో మాత్రం ఇదే విషయాన్ని వక్రీకరించి రాశారు. సీతను అపహరించింది రాముడని ప్రచురించారు. ప్రస్తుతం ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామాయణం గురించి పాఠ్యపుస్తకంలో ఆంగ్లంలో వివరణ ఇచ్చినప్పుడు ఈ పొరపాటు దొర్లింది. "రఘువంశం" అనే పాఠంలో ఈ తప్పిదం జరగగా.. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని.. పుస్తకానికి సంబంధించిన ఆన్‌లైన్ వెర్షనులో ప్రస్తుతానికి మార్పులు చేశామని తెలిపారు విద్యాశాఖ అధికారులు. అయితే ఇలాంటి పొరపాట్లు గుజరాత్ పాఠ్యపుస్తకాల్లో కోకొల్లలు అని పలువురు చెబుతున్నారు.


కానీ ఇలాంటి అనువాద దోషాల గురించి గుజరాత్ విద్యాశాఖ బాధ్యత వహించాలని తెలిపారు పలువురు విద్యావేత్తలు. ఇలాంటి పొరపాట్లు పాఠ్యపుస్తకాల్లో జరగడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతారని.. పాఠ్యపుస్తకాల్లో జరిగే తప్పులను ప్రభుత్వాలు సీరియస్‌‌గా తీసుకోవాలని పలు విద్యా సంఘాలు తెలిపాయి.