Bipin Rawat Escaped: ఆరేళ్లక్రితం మృత్యువుని జయించిన బిపిన్...ఈసారి మాత్రం
Bipin Rawat Escaped: భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణవార్త ఇంకా షాకింగ్‌గానే ఉంది. ఎన్నోసార్లు మృత్యువు చేరువకు వెళ్లి..బతికొచ్చిన పరిస్థితి. హెలీకాప్టర్ ప్రమాదంలో నాడు బతికారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు మీకోసం.
Bipin Rawat Escaped: భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణవార్త ఇంకా షాకింగ్‌గానే ఉంది. ఎన్నోసార్లు మృత్యువు చేరువకు వెళ్లి..బతికొచ్చిన పరిస్థితి. హెలీకాప్టర్ ప్రమాదంలో నాడు బతికారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు మీకోసం.
తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్ సమీపంలో అటవీప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులిక సహా 13 మంది మరణించారు. ఒకే ఒక్కడు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బతికారు. ప్రస్తుతం వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణాన్ని దేశం జీర్ణించుకోలేకపోతోంది.
జనరల్ బిపిన్ రావత్ (General Bipin Rawat)చాలా సందర్భాల్లో మరణానికి ఎదురెళ్లి..బతికి వచ్చారు. అందుకే ఆయన్ని మృత్యుంజయుడిగా కూడా పిలుస్తుంటారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈసారి మాత్రం అదే హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 వి5 హెలికాప్టర్(MI 17 V5 Helicopter)చాలా అత్యాధునికమైంది. విపత్కర పరిస్థితుల్ని కూడా తట్టుకోగలదు. ఈ ఛాపర్ సామర్ధ్యం 24 మంది కాగా..ప్రమాద సమయంలో 14 మంది ఉన్నారు. ఇందులో 13 మంది మరణించారు. వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఆయనకు శౌర్యచక్ర అవార్డు కూడా లభించింది.
ఆరేళ్లక్రితం జరిగిన ప్రమాదంలో
2015 ఫిబ్రవరి 3వ తేదీన నాగాలాండ్(Nagaland Helicopter Crash 2015)సమీపంలోని దిమాపూర్ జిల్లాలోని ఓ హెలీప్యాడ్ నుంచి బయలుదేరారు.చీతా హెలీకాప్టర్‌లో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. హెలీకాప్టర్ టేకాఫ్ అయిన కాస్సేపటికే సాంకేతికలోపంతో కుప్పకూలిపోయి..తునాతునకలైంది. అయితే ఆ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు ఇద్దరు సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అప్పట్లో బిపిన్ రావత్(Bipin Rawat)ప్రమాదంలో మరణించారనే అందరూ భావించారు. అప్పుడు మృత్యువుని జయించిన బిపిన్ రావత్..ఈసారి మాత్రం అదే హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే హెలీకాప్టర్ ప్రమాదం వెంటాడి మరీ ప్రాణం తీసుకుంది.
Also read: BlackBox: బిపిన్ రావత్ హెలీకాప్టర్ బ్లాక్‌బాక్స్ ఎక్కడ, అందులో ఏముంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook