Narendra Modi: దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి భద్రత వ్యవహారాల్లో లోపాలు ఎత్తిచూపాయి. భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బయటపడింది. వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి కాన్వాయ్‌పైకి చెప్పులు పడ్డాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారి తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రోడ్‌ షో చేస్తుండగా ప్రధాని కాన్వాయ్‌పైకి చెప్పులు పడ్డాయి. వాటిని భద్రతా సిబ్బంది తొలగించి బయటకు విసురుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Good News: రైతులకు మోదీ 3.0 తొలి కానుక.. వరితోపాటు పంటలకు భారీగా ధరలు పెంపు


వారణాసి లోక్‌సభ సభ్యుడిగా మూడోసారి నరేంద్ర మోదీ గెలిచిన విషయం తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటీవల వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన కాన్వాయ్‌తో రోడ్‌ షో చేస్తూ వెళ్తున్నారు. ఈ సమయంలో అతడికి స్వాగతం పలుకుతూ నిల్చున్న ప్రజల్లో కొందరు ప్రధాని కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరారు. ఆ చెప్పులు వచ్చి ప్రధాని కూర్చున్న కాన్వాయ్‌ ముందు భాగం అద్దం ముందు పడ్డాయి. ఇది గ్రహించిన భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని ఆ చెప్పులను తొలగించారు. అయితే ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: PM Narendra Modi: ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అదేనా.. !


ఈ సంఘటనతో ప్రధానమంత్రి భద్రతలో లోపాలు ఎత్తిచూపాయి. దేశాన్ని పాలించే ప్రధానికి ఇలాంటి అవమానం జరగడం వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ, ఇతర విపక్షాలు ఈ వీడియోను చూసి స్పందించాయి. మోదీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ సంఘటన నిదర్శనమని విపక్షాలు చెబుతున్నాయి. కాగా ఈ సంఘటనపై కేంద్ర భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. చెప్పు విసిరిన వారెవరో గుర్తించే పనిలో పడ్డట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.



 






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter