Free COVID-19 vaccine registration: కరోనాను కట్టడి చేయడం కోసం తొలుత 45 ఏళ్లకుపైబడిన వారికి మాత్రమే కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిన కేంద్రం ఆ తర్వాత మే 1 నుంచి 18 ఏళ్లకు (18+ age group) పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతించింది. దీంతో అప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్న వారు భారీ సంఖ్యలో ఉండగా.. ఆ తర్వాత ఆ సంఖ్య మరింత రెట్టింపయ్యింది. ఫలితంగా కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లు రిజిస్ట్రేషన్ (COVID-19 vaccine registration) చేసుకునే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ కారణంగా ఆశించిన సమయంలో, ఆశించిన చోట కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో స్లాట్స్ లభించక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, జనాల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఇదే అదనుగా భావిస్తూ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారు కూడా లేకపోలేదు. కరోనా ప్రాణాలు హరిస్తున్న ఇంత క్లిష్ట సమయంలోనూ కొంతమంది మోసగాళ్లు జనాన్ని ఎలా మోసంచేయాలా అనే చూస్తున్నారు. అందుకు వారికి లభించిన అస్త్రం ఈజీగా కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి అంటూ స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి ఓ Fake SMS పంపిస్తున్నారు. అదే ఎస్ఎంఎస్‌లో ఓ మాల్వేర్ లింక్ కూడా ఉన్న విషయం తెలియని యూజర్స్ ఆ లింకుపై క్లిక్ చేసి మోసపోతున్నారు. ఆ లింకుపై క్లిక్ చేసి పర్మిషన్స్ ఇవ్వడం అంటే మీ మొబైల్లో ఉన్న విలువైన సమాచారాన్ని మోసగాళ్ల చేతుల్లో పెట్టడమే అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Also read : Black Fungus Infection గుర్తిస్తే ఏం చేయాలో మార్గదర్శకాలు విడుదల చేసిన ICMR


Lukas Stefanko, Malware Hunter Team అనే సైబర్ పరిశోధకులు ఈ విషయాన్ని ముందుగా కనుగొన్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సులభమైన మార్గం ఇదిగో అంటూ ప్రభుత్వం తరపున వచ్చినట్టుగానే కనిపించే ఈ మెసేజ్ వెనుక సైబర్ మోసం ఉందని సైబర్ దోస్త్ (Cyber dost) ట్విటర్ ద్వారా వెల్లడించింది. మీలో ఎవరికైనా అలాంటి సందేశాలు వస్తే వెంటనే వాటికి స్పందించడం మానేసి డిలీట్ చేయాల్సిందిగా సైబర్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. 


కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లు రిజిస్ట్రేషన్ (COVID-19 vaccine registration) చేయించుకోవాలంటే కొవిన్ అధికారిక వెబ్‌సైట్, కొవిన్ మొబైల్ యాప్ లేదా ఆరోగ్య సేతు యాప్ (CoWIN website, Android app, and Aarogya Setu app) ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా సైబర్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.


Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook