Snake Killed Three Siblingsl: ఆ కుటుంబాన్ని పగ బట్టినట్టు ఒక పాము ముగ్గురిని చంపేసింది. మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకే పాము కుటుంబంలోని నలుగురిని కాటు వేసిన విషాద సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కుటుంబ పెద్ద పాముకాటుతో తీవ్ర అస్వస్థతకు ఆస్పత్రిలో కొన ప్రాణం మీద ఉన్నాడు. పాము కాటుతో ముగ్ఉరి మృతి వార్త సామాజిక మాధ్యమాలతోపాటు ఒడిశాలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..


 


ఒడిశాలోని బౌధ్‌ జిల్లా చరియాపల్లి గ్రామానికి చెందిన శాలేంద్ర మల్లిక్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు స్మృతిరేఖ (12), శుభరేఖ (9), సురభి (3)తోపాటు ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ కుటుంబం ఇంట్లో నిద్రించింది. నేలపై నిద్రించిన సమయంలో రాత్రిపూట ముగ్గురు కుమార్తెలకు ఏదో నొప్పి కలిగింది. వెంటనే వారు మేల్కొన్నారు. మల్లిక్‌కు కూడా నొప్పి ఏర్పడింది. లేచి చూడగా పక్కన పాము బుసలు కొడుతూ వెళ్లిపోయింది. ఇది చూసిన మల్లిక్‌ వెంటనే స్థానికులకు చేరవేశాడు.

Also Read: Cobra Kapala Viral Video: రూ.50 కిలోల టమాటోలకు సెక్యూరిటీగా గిరి నాగు.. సోషల్ మీడియాకే పిచ్చెక్కిస్తున్న వీడియో..


 


వెంటనే బంధుమిత్రులు, గ్రామస్తులు స్పందించి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుర్తించి పాము కాటు వేసిందని నిర్ధారించారు. అయితే ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో ముగ్గురు కుమార్తెల శరీరం మొత్తం విషం పాకింది. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి స్మృతిరేఖ, శుభరేఖ, సురభిలు మృతిచెందారు. అదే పాముకాటుకు గురయిన శాలేంద్ర మల్లిక్‌ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి, కుమారుడు పాము కాటు నుంచి బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఒక పామా? రెండు పాములా?
అయితే వారిని కరిచింది ఒక్క పామా? లేదా రెండు పాములా అనేది తెలియాల్సి ఉంది. సంఘటనను చూస్తుంటే ఒక్క పామే కరిచి ఉందని తెలుస్తోంది. వరుసగా ముగ్గురు బాలికలకు కాటేసిన పాము చివరకు శాలేంద్ర మల్లిక్‌కు కాటేసింది. అతడిని కాటే వేసే సమయానికి పాములో విషం తగ్గిపోయింది. అందుకే శాలేంద్ర ఇంకా బతికి ఉన్నాడని.. అతడి శరీరంలో విషం మోతాదు తక్కువగా వెళ్లి ఉంటుందని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో తరచూ పాము కాటు ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. పాముకాటుకు గురయి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.