సామాజిక దూరానికి పంగనామం..!!
`కరోనా వైరస్`.. మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల 892కు చేరింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 872 మంది బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి.
'కరోనా వైరస్'.. మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల 892కు చేరింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 872 మంది బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి.
ఇంత జరుగుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. ఐతే ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అత్యవసర పనులు చేసుకునేందుకు పరిమిత ఆంక్షలతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఐతే దీన్ని అక్కడక్కడ జనం అలుసుగా తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు తీసుకోవడానికి వెళ్లినప్పుడు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలన్న నిబధనలు ఉన్నాయి. కానీ జనం పలుచోట్ల ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
కోల్ కతాలోని రాజా బజార్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. రైతు బజార్ కు వచ్చిన జనం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. సామాజిక దూరం అస్సలు పాటించడం లేదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో అసలే జనసాంద్రత ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కానీ జనం ఇవేవీ పట్టించుకోవడం లేదు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ ఉద్ధృతిని ఆపడం కష్టతరమవుతోంది. ఇప్పుడున్నపరిస్థితుల్లో ఇలా కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా తిరిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..