ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఉబెర్, ఓలాలు విలీనం దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో ఉబెర్, ఓలా సర్వీసులు సేవలందిస్తున్నాయి. గతంలో ఈ రెండు కంపెనీల విలీనానికి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు. కానీ ప్రస్తుతం ఆ దిశగా చర్చలు మొదలయ్యాయని సమాచారం. కాగా రెండింటి మధ్య ఉన్న  పోటీవల్ల నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఈ రెండు ఒక్కటయ్యే అవకాశం ఉంది.


ఉబెర్‌, దేశీయ దిగ్గజం ఓలాలను విలీనం చేసే దిశగా రెండు సంస్థల్లో అతిపెద్ద పెట్టుబడిదారైన జపాన్‌ టెక్నాలజీ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రోత్సహిస్తోంది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఇరు సంస్థల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య గతకొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నాయని, కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు ఊపందుకున్నాయని ఈ వ్యవహారం గురించి తెలిసిన కొందరు వ్యక్తులు వెల్లడించారు.