Surya Grahanam 2020 | ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలుండగా తొలి సూర్యగ్రహణం(Solar Eclipse 2020 June 21) జూన్ 21న ఏర్పడనుంది. రేపు అద్భుత ఖగోళ సంఘటన జరగబోతోందని, పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం(Solar Eclipse 2020) ఏర్పడుతుందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ తెలిపారు. ఆఫ్రికాలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, ఇథియోపియా, ఆసియాలో పాకిస్థాన్, భారత్, చైనా దేశాలలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం (Surya Grahanam In Telugu) అంటే?
కొన్నిసార్లు భూమికి, సూర్యుడికి, మధ్య చంద్రుడు వస్తాడు. ఆ సమయంలోో సూర్యుడి వెలుగును భూమిపై పడకుండా చంద్రుడు కప్పి ఉంచుతాడు. దీంతో భూమిపై చంద్రుడి నీడ పడటంతో అక్కడివరకు సూర్యుడిని కప్పి ఉంచే ప్రక్రియను సూర్యగ్రహణం(Solar Eclipse) అంటారు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పి ఉంచినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం, చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  Photos: ఆకాశంలో అద్భుతం.. సూర్యగ్రహణం ఎక్కడ.. ఎలా, ఫొటో గ్యాలరీ


విశ్వవ్యాప్తంగా ఉదయం 9:15:58 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. సూర్యుని నుండి నేరుగా కిరణాలు అనేవి వస్తుంటాయి. మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో మొదటగా ప్రజలు సూర్యగ్రహణం(Surya Grahanam) వీక్షిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గ్రహణం పాక్షికంగా కనపడుతుంది.


సూర్యగ్రహణం తెలంగాణలో ఉదయం 10:15 గంటల నుండి మధ్యాహ్నం 1:44 గంటల  వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ఏపీలో ఉదయం 10:21 గంటల నుండి మధ్యాహ్నం 1:49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ