ఎముకలు కొరికే చలిలో.. దేశభక్తి చాటిన ఇండో టిబెటిన్ దళాలు
ఇండో టిబెటిన్ బోర్డర్‌లో మైనస్ 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా.. ఆ ఎముకలు కొరికే చలిలో దేశభక్తిని చాటుకున్నారు పోలీసులు
ఇండో టిబెటిన్ బోర్డర్‌లో మైనస్ 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా.. ఆ ఎముకలు కొరికే చలిలో దేశభక్తిని చాటుకున్నారు పోలీసులు. రిపబ్లిక్ డే సందర్భంగా మార్చింగ్ చేయడం మాత్రమే కాకుండా.. 18000 అడుగుల ఎత్తులో జాతీయ జెండా కూడా ఎగురవేశారు. నేటి యువతలో దేశభక్తిని పెంపొందించడం కోసం తాము ఈ పనికి శ్రీకారం చుట్టామని ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. అదేవిధంగా విజయవంతంగా హిమాలయ మంచు కొండల్లో జెండా ఎగురువేశాక.. దానిని వీడియో కూడా తీశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టు చేశారు పోలీస్ అధికారులు. "హిమ్ వీర్స్" అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.