BJP leader Sonali Phogat Dies of Heart Attack in Goa: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్ మృతి చెందారు. గోవా టూర్‌లో ఉన్న ఫోగట్ గుండెపోటుతో మరణించారు. సోమవారం (ఆగష్టు 22) రాత్రి ఆమెకు తీవ్ర గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచారు. ఫోగట్ వయసు 42. సోనాలి ఫోగట్ మరణించిన వార్తను ఆమె సోదరుడు వతన్ సింగ్ ధాకా ధృవీకరించారు. ఫోగట్ మరణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోనాలి ఫోగట్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోనాలి ఫోగట్ భ‌ర్త సంజ‌య్ ఫోగ‌ట్ 2016లో అనుమానాద‌స్ప రీతిలో త‌న ఫామ్‌హౌజ్‌లో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె కుమార్తె యశోధర ఫోగట్‌తో కలిసి ఉంటున్నారు. 2019 హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఫోగట్ పోటీ చేశారు. కుల్దీప్ బిష్ణోయ్‌పై బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేశారు. బిగ్ బాస్ 14లో సోనాలి ఫోగట్ చివ‌రిసారి క‌నిపించారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో షోలోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ షో ద్వారా ఫోగట్ బాగా పాపుల‌ర్ అయ్యారు.


టిక్‌ టాక్‌లోనూ సోనాలి ఫోగట్‌కు మంచి పాపులారిటీ ఉంది. 'ఏక్ మా జో లాకోం కి లియే బ‌నీ అమ్మా' అనే టీవీ సీరియ‌ల్‌లో ఆమె నాటించారు. అంతేకాదు కొన్ని హ‌ర్యానా చిత్రాల్లో కూడా న‌టించారు. పంజాబీ, హ‌ర్యాన్వీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఫోగట్‌ క‌నిపించారు. ద స్టోరీ ఆఫ్ బ‌ద్మాష్‌ఘ‌ర్ వెబ్ సిరీస్‌లోనూ ఆమె న‌టించారు. 


సోనాలి ఫోగట్‌ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధంకర్ సంతాపం వ్యక్తం చేశారు. సోనాలి ఫోగట్ మరణ వార్త విని షాక్ అయ్యానని, ఇది నిజంగా విచారకరమైన వార్త అని పేర్కొన్నారు. హిసార్‌లోని పార్టీ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ భూపేందర్ మాట్లాడుతూ.. 'కొంతమంది సహచరులతో కలిసి సోనాలి ఫోగట్ గోవాకు వెళ్లారు. గుండెపోటుకు గురై తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గోవాలో లాంఛనాలు పూర్తయ్యాయి. ఫోగట్ మృతదేహాన్ని హర్యానాకు తీసుకువస్తారు' అని అన్నారు. 


Also Read: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు అతడు దూరం!


Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్‌డేట్! దసరాకు భారీగా డబ్బులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook