Sonia Gandhi: దేశ ప్రజలకు సోనియా గాంధీ విలువైన.. భావోద్వేగకరమైన సందేశం
Sonia Gandhi Call To Public Amid Lok Sabha Elections: అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన వేళ జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు విలువైన భావోద్వేగకరమైన సందేశం ఇచ్చారు.
Sonia Gandhi: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సందేశం ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితి.. ఎన్నికల్లో ఎవరి పక్షాన నిలబడాలో ఆమె సూచించారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన సోనియా గాంధీ సార్వత్రిక ఎన్నికలపై తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కీలక సూచన చేశారు.
Also Read: Modi Vs Rahul: భయపడకు.. పారిపోకు: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలని సోనియా గాంధీ తన సందేశం ద్వారా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ హయాంలో దేశంలో జరుగుతున్న అరాచకాలు, అఘాయిత్యాలపై సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. ద్వేషాన్ని పెంచుతున్న వారిని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ ఉజ్వలమైన భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించినట్లు వివరించారు.
Also Read: Asaduddin Owaisi: ముస్లింలే ఎక్కువ కండోమ్‌లు వాడుతున్నారు: అసదుద్దీన్
'నా సోదర సోదరీమణుల్లారా' అంటూ ప్రారంభించిన సోనియా గాంధీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వివరించారు. 'ప్రజాస్వామ్యాన్ని.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష ఇండియా కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయి. అబద్ధాలు, విద్వేషాన్ని తిరస్కరించాలి. మెరుగైన భవిష్యత్ కోసం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. బీజేపీ, నరేంద్ర మోదీ పాలనలో నిరుద్యోగం, మహిళలపై నేరాలు, కొన్ని వర్గాలపై వివక్ష తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని పొందడమే బీజేపీ, ప్రధాని మోదీ లక్ష్యం. అందరితో కలిసిపోవడం, చర్చలు జరపడాన్ని బీజేపీ తోసిపుచ్చుతంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానమైన హామీ దేశాన్ని ఐక్యంగా ఉంచడమే!రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి దిశగా మా నిర్ణయాలు ఉంటాయి' అని సోనియా గాంధీ తన సందేశంలో తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter