ప్రియమైన ప్రధానమంత్రి గారు.. రైతులకు క్షమాపణలు మాత్రమే సరిపోవు : ప్రకాష్ రాజ్
Prakash Raj questions PM Modi: రైతులకు కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్‌తో ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు.
Prakash Raj questions PM Modi: సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ (#Just Asking) హాష్ ట్యాగ్‌తో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ తాజాగా నూతన సాగు చట్టాల రద్దు విషయంలో ప్రధాని మోదీని ప్రశ్నించారు. రైతులకు కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని వ్యాఖ్యానించారు. 'ప్రియమైన ప్రధానమంత్రి గారు... క్షమాపణలు మాత్రమే సరిపోవు... ఆ రైతు కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా...' అని ప్రశ్నించారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన 750 పైచిలుకు రైతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ కామెంట్స్ చేశారు. తద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పట్టింపు కేంద్రానికి లేదా అని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రశ్నించినట్లయింది.
సాగు చట్టాల రద్దుకై రైతులు సాగించిన ఉద్యమంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరుపున రూ 3లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాగు చట్టాల రద్దు (Farm laws) రైతులు తమ అద్భుత పోరాటంతో సాధించిన విజయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా... మరణించిన ప్రతీ రైతు కుటుంబానికి రూ.25లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర్ అమలు చేయాలన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అనేక రైళ్లు దారి మళ్లింపు
ఉద్యమంలో మరణించిన రైతు (Farmers) కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ హీరోలు రానా, రామ్, నాని, హీరోయిన్ సమంత ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. హీరో రామ్ ట్విట్టర్‌లో దీనిపై స్పందిస్తూ... 'సాగు చట్టాల వల్ల కలిగే ఇబ్బందులను పక్కనపెడితే... కేసీఆర్ గారి నిర్ణయం రైతుల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోంది.' అని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం కేసీఆర్ చేసిన ప్రకటనపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చని కేసీఆర్... పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేస్తానంటే ఎలా నమ్మేదని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook