Railway New Rules: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన రేపుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కొత్త నిబంధనలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వేరియంట్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant)శరవేగంగా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అప్పుడే 46 దేశాలకు వ్యాపించింది. ఇండియాలో బెంగళూరులో 2 కేసులతో ప్రారంభమై..ఇప్పుడు 30 వరకూ పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్‌కు కారకమైన డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా విస్తరించనుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా రైల్వేశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల విషయంలో కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. 


కోవిడ్ 19 వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) సంక్రమణను ముందు నుంచే నివారించేందుకు జాగ్రత్తలు చేపట్టింది. విదేశాల్నించి వచ్చే ప్రయాణీకులతో దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కఠినమైన మార్గదర్శకాల్ని జారీ చేసింది. ప్రతి రైల్వే కార్మికుడికి వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. మాస్క్ లేకపోతే ఎవరికీ రైల్వే స్టేషన్, రైళ్లలో ప్రవేశం లేదు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్‌లో వస్తే..5 వందల రూపాయలు జరిమానా విధించనున్నారు. ఇప్పటికే ఈ కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు జరుగుతున్నాయి. రైల్వే శాఖ(Railway New Rules)జారీ చేసిన నిబంధనలపై అవగాహన కోసం ప్రకటనల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 


Also read: Blue Aadhaar Card: బ్లూ ఆధార్‌కార్డు ప్రత్యేకతలేంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook