నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’ చిత్రాన్ని అయిదు రోజుల పాటు 24/7 ప్రదర్శనలు వేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఈ 24x7 ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సంక్రాంతి సందర్భంగా ఈ ప్రదర్శనలకు అనుమతిని తీసుకొన్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.


ప్రేక్షకుల రద్దీ, బ్లాక్‌ టికెట్లను విరివిగా అమ్మడం లాంటి అంశాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ఏపీ ప్రభుత్వం అనుమతి అందించినా.. తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.  ‘జై సింహా’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై నిర్మిస్తున్నారు.