స్పైస్ జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
షిర్డీలో స్పైస్ జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
షిర్డీ: ఢిల్లీ నుంచి షిర్డీకి వచ్చిన స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం విమానాశ్రయంలో దిగే క్రమంలో రన్‌వే ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానానికి తృటిలో ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని స్పైస్ జెట్ వెల్లడించింది. విమానం రన్ వే పై దిగిన అనంతరం విమానాశ్రయం సిబ్బంది సహాయకార్యక్రమాలు చేపట్టి ప్రయాణికులను అక్కడి నుంచి సురక్షితంగా విమానాశ్రయం ప్రాంగణంలోకి చేర్చారు.
తాత్కాలికంగా రన్ వేను మూసేసి మిగితా కార్యక్రమాలు పూర్తిచేస్తున్నట్టు షిర్డి విమానాశ్రయం డైరెక్టర్ దీపక్ శాస్త్రి తెలిపారు.