విమానం ల్యాండింగ్ గేర్ డోర్లో చిక్కుకుని టెక్నిషియన్ మృతి!
స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ గేర్ లోపల మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా ల్యాండింగ్ గేర్ డోర్ మూసుకుపోవడంతో ఓ టెక్నిషియన్ మృతి చెందిన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
కోల్‌కతా: స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ గేర్ లోపల మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా ల్యాండింగ్ గేర్ డోర్ మూసుకుపోయిన ఘటనలో టెక్నిషియన్ రోహిత్ పాండే మృతిచెందాడు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి అర్థరాత్రి దాటాక 1 గంట ప్రాంతంలో Q400 విమానానికి మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
[[{"fid":"179095","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ల్యాండింగ్ గేర్ తలుపు మూసుకుపోవడంతో దురదృష్టవశాత్తుగా టెక్నిషియన్ రోహిత్ పాండే అందులోనే చిక్కుకుని మృతిచెందినట్టు విమానాశ్రయం ఉన్నతాధికారి ఒకరు పీటీఐకి వెల్లడించారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో టెక్నిషియన్ మృతదేహాన్ని వెలికి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.