విజయపురకి చెందిని సిద్ధేశ్వర్ స్వామిజీ భారతప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. తనకు ప్రభుత్వం అంటే ఎంతో గౌరవం ఉందని.. అయితే తాను ఒక సన్యాసిని కావడం వల్ల ఐహికపరమైన విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందని.. తనకు ఎలాంటి అవార్డులపైనా ఆసక్తి ఉండదని ఆయన తెలిపారు.


తన నిర్ణయాన్ని గౌరవించి ప్రధాని నరేంద్ర మోదీ తన అభ్యర్థనను స్వీకరించాలని ఆయన తెలిపారు. ఈ విషయాలన్నీ ఆయన ఒక ఉత్తరం ద్వారా ప్రధానిమంత్రి కార్యాలయానికి చేరవేశారు. సిద్ధేశ్వర స్వామిజీ తన ప్రవచనాలతో కర్ణాటకలో ఎందరో అనుయాయులను సంపాదించుకున్నారు. ఇప్పటికీ నిరాడంబర జీవితం గడుపుతూ.. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆయన పేరు మీద ఓ ఫేస్బుక్ పేజీ కూడా ఉంది