నటి శ్రీదేవి కొద్ది నెలల క్రితం దుబాయిలో ఓ హోటల్‌లో మరణించిన విషయం తెలిసిందే. బాత్‌టబ్‌లో పడిపోయినప్పుడు ప్రమాదవశాత్తు సంభవించిన గుండె పోటు వల్ల ఆమె మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె మరణానికి సంబంధించి అసలు కారణాలను తెలుసుకోనేందుకు దర్యాప్తు అత్యవసరమని పలువురు సుప్రీంకోర్టులో పిటీషను దాఖలు చేయగా.. కోర్టు ఆ పిటీషను టేకప్ చేయడానికి నిరాకరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఇటీవలే ఢిల్లీకి చెందిన వేద్ భూషణ్ అనే మాజీ ఏసీపీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిది ముమ్మాటికి హత్యేనని ఆయన తెలిపారు.ఆమె బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించింది అని చెప్పడం వెనుక ఏదో పథకం ఉందని తనకు అనిపిస్తుందని.. దుబాయి డాక్టర్లు ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక కూడా క్లారిటీగా లేదని.. అందుకే ఆమె మరణం ముమ్మాటికి హత్యేనని తనకు అనుమానం కలుగుతుందని ఆయన తెలిపారు.


వేద్ భూషణ్ పదవీ విరమణ చేసి ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఆయన గతంలో ఢిల్లీలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు. తనకు దుబాయ్ పోలీసులు ఇచ్చిన నివేదిక పై అభ్యంతరాలున్నాయని ఆయన అన్నారు. అసలు అక్కడ ఆ సమయంలో ఏం జరిగిందన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎన్నో ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది.


అయినా ఈ కేసును మూసివేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించారు. ఈ కేసులో నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు వేద్ భూషణ్ దుబాయ్ సైతం వెళ్లారు. శ్రీదేవి బస చేసిన హోటల్‌‌లోనే ఆయన బస చేశారు. అయితే ఆయన శ్రీదేవి గదిని చూడాలని అనుకుంటున్నానని తెలిపినప్పుడు.. దుబాయ్ పోలీసులు అనుమతించలేదు.